గొలుగొండ మండల తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడిగా చిటికెల తారక వేణుగోపాల్ ఏకగ్రీవ ఎన్నిక

 


గొలుగొండ మండలం తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా మాజీ జడ్పిటిసి చిటికెల తారక వేణుగోపాలం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ విధేయుడుగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుండే వేణుగోపాలకు అధిష్టానం సముచిత స్థానం కల్పించినట్లు అయిందని టిడిపి నాయకులు కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో ఎంతో కీలకమైన మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు స్పీకర్ అయ్యన్నపాత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరు అయ్యేందుకు తన వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు అలాగే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ సీనియర్ నాయకులు తో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.