శ్రీ కోదండరామ కళ్యాణ ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన స్పీకర్స్ చింతకాయల అయ్యన్నపాత్రుడు

 కోదండరామ కళ్యాణ ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన.. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు

గొలుగొండ జూన్ 14 9tvdigital 

శ్రీ కోదండ రామస్వామి కళ్యాణ ఆహ్వాన పత్రికను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు.




అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జానకిరాంపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కోదండరామ స్వామి వారి నాలుగో వార్షికోత్సవ కళ్యాణ ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు స్పీకర్ కు అందజేశారు. జూన్ 18 జరిగే కోదండ రామస్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని కోరి ఆహ్వాన పత్రికతో పాటు గోడ పత్రికను కూడా అందజేశారు. మూడు రోజులు పాటు నిర్వహించే కళ్యాణ మహోత్సవం జూన్ 17 ఉదయం 8 గంటలకు కళ్యాణమూర్తులను అలంకరించి గ్రామోత్సవం నిర్వహిస్తారు. జూన్ 18 బుధవారం శ్రీ కోదండరామస్వామి కళ్యాణం ఆలయ ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు ప్రారంభించినట్లు తెలిపారు. 19 జూన్ 19 గురువారం ఉదయం స్వామివారికి పంచామృత స్నానం సాయంత్రం 6 గంటలకు శ్రీ పుష్పయాగం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న దంపతులు, విజయ్, రాజేష్ దంపతులు హాజరుకావాలని కోరామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి అందరూ ఆహ్వానితులేనని 18 వ తారీకు కళ్యాణ అనంతరం భారీ అన్నమారాధన ఏర్పాటు చేశామన్నారు. ఆహ్వానితులంతా కళ్యాణాన్ని కనులారా వీక్షించి ధరించాలన్నారు. ఈ కళ్యాణానికి అనకాపల్లి జిల్లాతో పాటు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుండి కూడా అతిధులు సహాయకర్తలు దాతలు హాజరవుతున్నారని జిల్లా నుంచి అన్ని గ్రామాల ప్రజలకు ఆహ్వానం పంపామని కమిటీ సభ్యులు తెలిపారు.