అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం వద్ద ఐ టి యు ఆధ్వర్యంలో ర్యాలీ

 వేతనాలు పెంచాలి,FRS రద్దు చేయాలి,సంక్షేమ పథకాలు అమలు చేయాలి-CITU రాష్ట్ర కార్యదర్శి G. కోటేశ్వరరావు 


నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆల్ ఇండియా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు)జాతీయ పిలుపులో భాగంగా బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా G. కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్ల పైన ఆన్లైన్ యాప్ లో ఒత్తిడి తీవ్రంగా ఉందన్నారు, రేయం బళ్ళు వర్క్ చేస్తున్నా మొబైల్ ఫోన్లు సపోర్ట్ చేయక, 2gb నెట్ తో, నెట్వర్క్ సరిగ్గా లేక ఆన్లైన్ వర్క్ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే గత 42 రోజులు సమ్మె ప్రభుత్వం చేసిన ఒప్పందాలను అమలు చేయాలన్నారు. ముఖ్యంగా వేతనాలు పెంచే విషయంలో ప్రభుత్వం నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని అంగన్వాడీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈసందర్బంగా అనగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు దుర్గారాణి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలు ఆర్థిక ఇబ్బందుల్లో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో కేవీపీస్ జిల్లా కార్యదర్శి ఈ. చిరంజీవి, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు లు. గౌరి నర్సీపట్నం, గొలుగొండ ప్రాజెక్ట్ నాయకులు మహాలక్ష్మి, భ్రమరాంబ, మంగ, వరలక్ష్మి, కృష్ణవేణి, పద్మజా,సత్యవతి, వసంతా తదితరులు పోలుగొన్నారు