ఏ ఎల్ పురం లో నక్క దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించిన అటవీశాఖ అధికారులు

 నైన్ టీవీ డిజిటల్ అక్టోబర్ 31....  నక్క దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించిన అటవీశాఖ అధికారులు 

కృష్ణదేవిపేట అటవీ శాఖ అధికారి కే.శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణరావు, 


గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏ ఎల్ పురం గ్రామంలో బుధవారం అటవీ నక్క దాడిలో గాయపడిన లగుడు కొండబాబు, మాకిరెడ్డి రాము,లను అటవీ అధికారులు గురువారం పరామర్శించారు. కృష్ణ దేవి పేట రేంజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అటవీ శాఖ రేంజ్ అధికారి కే శ్రీనివాసరావు మాట్లాడుతూ నక్క దాడిలో బాధితులకు స్వల్ప గాయాలు అయ్యాయని వారు కృష్ణదేవి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందారిని బాధితులు తెలిపారని అన్నారు. మెరుగైన వైద్య సేవలు అవసరమైతే వైద్యాధికారులు సూచనల మేరకు వైద్య సేవలు అందిస్తామని ఈ సందర్భంగా అయన తెలిపారు. అదేవిధంగా మండలంలో అచ్చంపేట గ్రామంలో రైతులకు ఉపయోగపడే టేకు బాదం సీతాఫలం సరుగుడు వంటి జాతుల మొక్కలను పెంపకం చేపట్టి రైతులకు ఉచితంగా అందజేయడం జరుగుతుందని అన్నారు అలాగే కృష్ణ దేవి పేట రేంజ్ కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు వసతి మరియు రేంజ్ కార్యాలయం మంచినీటి బోరు ప్రహరీ గోడ నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని నిధులు మంజూరు అయితే నిర్మాణాలు చేపడతామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి సత్యనారాయణ, గార్డులు ఎరుకులమ్మ, గవిరేసు, సత్యనారాయణ, గణపతి, తదితరులు పాల్గొన్నారు