9tvdigital అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలం పప్పు శెట్టిపాలెం రంగురాళ్ల క్వారీలో తవ్వకాలు జరుగుతున్నాయని నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారికి ఆదేశాల మేరకు పప్పు శెట్టిపాలెం రంగురాళ్ల కారిని గొలుగొండ తాసిల్దార్ పి. శ్రీనివాసరావు ,మరియు గొలుగొండ ఎస్సై పి. రామారావు శనివారం రాత్రి సంఘటన స్థలాని పరిశీలించారు
అనంతరం తాసిల్దార్ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ రెవెన్యూ సిబ్బంది 24 గంటలు కాపలా ఉన్నారని ఎక్కడ ఎటువంటి రంగు రాళ్లు తవ్వకాల్లో జరగలేదని ఆయన తెలిపారు పోలీస్ రెవిన్యూ సిబ్బందితో పాటు ఫారెస్ట్ సిబ్బందిని కూడా నియమించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే గొలుగొండ ఎస్సై పి. రామారావు మాట్లాడుతూ రంగురాళ్ల కార్యాలయంలో ఎవరు కూడా తవ్వకాలు జరపలేదని ఎక్కడ పోలీస్ సిబ్బంది రెవిన్యూ సిబ్బంది నిరంతరం షెడ్ వేసుకొని ఇక్కడే కాపలా ఉండడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎవరో కొంతమంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రెవిన్యూ సిబ్బంది సంఘటనా స్థలంలో పరిశీలన జరిగింది.