*త్రోబాల్, బేస్ బాల్ పోటీల్లో రాష్ట్ర పోటీలకు ఎంపికైనా జోగంపేట హై స్కూలు విద్యార్థులు*
అనకాపల్లి గొలుగొండ మండలం జోగంపేట జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థులు అనకాపల్లిలో జరిగిన జిల్లా స్థాయి బేస్ బాల్ పోటీలో రూత్తల నాగలక్ష్మి, శివగణేష్ త్రోబాల్ పోటీలో నెమపు ఉషశ్రీ ఉమ్మడి విశాఖ జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈసందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. సరోజినీ అభినందనలు తెలియజేశారు.విద్యార్థులు త్వరలో రాష్ట్ర స్థాయిలో జరిగే త్రోబాల్, బేస్ బాల్లో ఆటల్లో కూడా సత్తాచాటాలన్నారు. అలాగే విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని ఈసందర్బంగా ఆమె కోరారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.