గొలుగొండ మండలం సిహెచ్ నాగ పురంలో పొలం పిలుస్తుంది ఏవో సుధారాణి

 అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్ నాగ పురం గ్రామంలో ఈరోజు పొలం పిలుస్తుంది


అనే కార్యక్రమం ఏవో సుధారాణి ఆధ్వర్యంలో రైతుల సమక్షంలో నిర్వహించడమైనది ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ వరి పంటకు సుడిదోమవచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున చెస్ అనే మందు ఒక లీటరునీటిలోక 0.6మందును కలిపి పిచికారి చేసుకొన్నట్లయితే చూడు దోమ నుండి పంటను కాపాడుకోవచ్చు అలాగే ఈ క్రాఫ్ట్ ను ప్రతి ఒక్కరు  చేయించుకోవాలి ఈక్రాప్ చేయనట్లయితే పంటను కొలిగోలు చేయడం జరగదు అలాగే పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సొమ్ము  పడని రైతులు బయోమెట్రిక్ చేయించుకోవాలి ఎవరికైనా పిఎం కిసాన్ డబ్బులు పడని వారు ఆధార్ కార్డు పట్టాదార్ పాస్ పుస్తకం గ్రామ సచివాలయలో అగ్రికల్చర్ అసిస్టెంట్కు ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాము మాస్టర్ ట్రైనర్ ఎం టి వరలక్ష్మి ఐ సి ఆర్ పి వి సత్యవతి వెటర్నరీ అసిస్టెంట్ జోగేంద్ర విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రసన్న  కూటమి నాయకులు సేనాపతి వరహాలు బాబు శివ పోలిశెట్టి సత్యనారాయణ పల్లా రాజబాబు రైతులు పాల్గొన్నారు