మూఢనమ్మకాలు పై అవగాహన సదస్సు

  9tvdigital మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు కార్యక్రమం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏ ఎల్ పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల


ప్రధానోపాధ్యాయులు వి.నాగభూషణం గారి అధ్యక్షతన జన విజ్ఞాన వేదిక (ఆ,, ప్ర,,) నర్సీపట్నం డివిజన్ కమిటీ రాష్ట్ర జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షులు కే త్రిమూర్తుల రెడ్డి, రాష్ట్ర ఇంద్రజాలకుడు సిహెచ్ రాములు, జన విజ్ఞాన వేదిక సభ్యులు జోగి నాయుడు గారి ఆధ్వర్యంలో సైన్స్ మ్యాజిక్స్ ద్వారా మూఢనమ్మకాలపై ఉన్న నమ్మకాన్ని పారద్రోలే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీమతి లోచల సుజాత, మండల అధ్యక్షురాలు శ్రీమతి గజ్జలపు మణికుమారి పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ లగుడు వెంకటరాజుల నాయుడు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత మాట్లాడుతూ సైన్స్ మరియు ఇంతటి సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ఇంకా మూఢనమ్మకాలు నమ్మవద్దని దానివలన అనేక అనర్ధాలు జరిగే అవకాశం ఉందని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు తెలియపరచారు.