అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

 9tvdigital

ఘోర రోడ్డు ప్రమాదం

*రావణాపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.

*అతి వేగంతో రాంగ్ రూట్ లో వెళ్లి AP 05 EV 3066 అను నెంబర్ గల ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న AP 31 DM 4578 అను నెంబర్ గల కారు.


*తాగిన మైకంలో ఉన్న కారు డ్రైవర్.

*అతివేగం అలాగే ఈ ఘోర ప్రమాదం జరగడానికి కారు డ్రైవరే కారణం.

*ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు కాళ్లు విరిగిపోయాయి.

*ఇద్దరిలో ఒకరు మృతి.


*ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు రాజేంద్రపాలెం వాసి కాగా, మరొకరు నర్సీపట్నం ప్రాంతంలోని ఎరకంపేట వాసిగా గుర్తింపు.

(అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం):

వివరాలు చూసినట్లయితే అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం లోని రావణాపల్లి గ్రామ శివారులో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ సత్తిబాబు తాగిన మైకంలో రాంగ్ రూట్ లో స్పీడుగా వెళ్తూ ఎదురుగా రాజేంద్రపాలెం నుండి వస్తున్న అంబటి అప్పన్న అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. దీంతో అప్పన్న రహదారిపై పడిపోగా, ద్విచక్ర వాహనం వెనకాల కూర్చున్న నర్సీపట్నం ప్రాంతంలోని ఎరకంపేట గ్రామానికి చెందిన యాదగిరి రాజుబాబు అనే వ్యక్తి సుమారుగా 15 అడుగుల లోయలోకి పడిపోయాడు.ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న అప్పన్న,రాజుబాబు అనే ఇద్దరు వ్యక్తులకు చెరొక కాలు విరిగిపోగా,రాజుబాబు కొద్దిసేపటి వరకు ప్రాణాలతో ఉండి మృతి చెందాడు.అప్పన్న ను అంబులెన్స్ లో కృష్ణాదేవిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అక్కడినుండి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా కృష్ణాదేవి పేట గ్రామ శివారులో మార్గం మధ్యలోనే మరణించాడు. అప్పన్న రాజేంద్రపాలెం నుండి వస్తుండగా రాజబాబు అనే వ్యక్తి మార్గమధ్యలో లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కినట్లు సమాచారం తెలుస్తుంది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారు గొలుగొండ మండలంలోని పాత కృష్ణాదేవి పేట నుండి చింతాలమ్మ గుడికి వెళుతున్నట్లు కారులో ప్రయాణిస్తున్న వారు చెప్పారు. ఈ ఘోర ప్రమాదానికి డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ సత్తిబాబు తాగి ఉండటమే ముఖ్య కారణంగా తెలుస్తుంది.