ఏ ఎల్ పురం మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్యంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం ఏ ఎల్ పురం మేజర్ పంచాయతీ గొల్ల వీధిలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గ్రామ సర్పంచ్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు శ్రీమతి లోచల సుజాత,ఎంపీటీసీలు మామిడి కృష్ణ,చింతల బుల్లి ప్రసాద్,వైస్ సూపర్ సర్పంచ్ కుండల పెదబాబులు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గౌరవనీయులు మా శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు, గ్రామ పెద్దలు నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిటికెల భాస్కర్ నాయుడు గారి సూచనలు, సలహాలు,సహకారంతో గ్రామాభివృద్ధిలో ముందుకు వెళతూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియపరచారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఎటువంటి లంచాలు లేకుండా సంక్షేమ పథకాలును అందిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలైనా గ్రామ సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు,నాడు నేడు ద్వారా స్కూళ్లు,హాస్పటల్లు అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.