సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో స్ట్రాంగ్ రూమ్స్ మరియు సీ.ఏ.పీ.ఎఫ్ కు వసతి ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీ రవి పట్టాన్ శెట్టి

 అనకాపల్లి జిల్లా పోలీసు

సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో స్ట్రాంగ్ రూమ్స్ మరియు  మరియు సీ.ఏ.పీ.ఎఫ్ కు వసతి ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీ రవి పట్టాన్ శెట్టి ఐ.ఏ.ఎస్.గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మురళీకృష్ణ ఐ.పి.ఎస్., గారు.

అనకాపల్లి జిల్లా 2024సం. సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఎన్నిక‌ల‌ను అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో నిష్ప‌క్షపాతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఈసీఐ మార్గద‌ర్శకాల‌కు అనుగుణంగా  స్ట్రాంగ్ రూం కేంద్రాల‌ను మరియు సీ.ఏ.పీ.ఎఫ్ కు వసతి ఏర్పాట్లు పరిశీలించి, పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు. 

ఈ నేపధ్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ శ్రీ రవి పట్టాన్ శెట్టి ఐ.ఏ.ఎస్., మరియు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐ.పి.ఎస్., మరియు ఇతర అధికారులు  కలిసి చోడవరం డిగ్రీ కాలేజ్ వద్ద స్ట్రాంగ్ రూమ్, వి.మాడుగుల, ఆర్.సి.యం స్కూల్  వద్ద స్ట్రాంగ్ రూమ్ లను మరియు అనకాపల్లి జీవీఎంసీ మెయిన్ స్కూల్ లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉండేందుకు వసతి ఏర్పాట్లను సంబంధించి భ‌వ‌నాల‌ను ప‌రిశీలించారు.

స్ట్రాంగ్‌రూమ్‌లు కేంద్రాలకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లపై చ‌ర్చించి,  తీసుకోవాల్సిన భద్రతా చ‌ర్యల‌పై అధికారుల‌కు సూచ‌న‌లిచ్చారు.  

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ...... పరిసర ప్రాంతాలలో నిరంత‌ర సీసీ కెమెరాల నిఘా, ప్రత్యేక సాయుధ బ‌లగాల ప‌హారా  ఏర్పాట్లు చేయ‌డం,  పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంత‌రం క‌ట్టుదిట్టమైన భ‌ద్రత‌తో ఈవీఎంల‌ను స్ట్రాంగ్‌రూంల‌కు చేర్చి భ‌ద్రప‌ర‌చ‌డం మొదలగు అంశాలలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు మరియు విమర్శలకు తావులేకుండా అన్ని శాఖల సమన్వయంతో సమర్ధవంతంగా మరియు పకడ్బందీగా ప‌టిష్ట ప్రణాళిక‌తో బందోబస్త్ ఏర్పాట్లు చేయ‌నున్నట్లు తెలిపారు.

ఎస్పీ గారి వెంట అదనపు ఎస్పీ శ్రీ బి.విజయభాస్కర్, అనకాపల్లి సబ్ డివిజన్ డిఎస్పి శ్రీ వి.సుబ్బరాజు, ఎస్బి డిఎస్పి శ్రీ బి.అప్పారావు

ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ శంకర రావు, చోడవరం ఎస్సై శేఖరం మరియు కె.కోటపాడు సిఐ స్వామి నాయుడు, ఎస్సై శ్రీనివాసరాజు మరియు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం,

అనకాపల్లి.