రాజ్య సభకు ఎన్నికై మొదటిసారిగా విశాఖపట్నం విచ్చేసిన గౌరవ నీయులు పాయకరావు పేట
శాసనసభ్యులు శ్రీ గొల్ల.బాబురావు గారిని విశాఖపట్నం వారి స్వగృహం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి దూస్సాలువతో సత్కరించి పుష్ప గుచ్చాన్నిచ్చి శుభాకాంక్షలు తెలియపరిచిన ఏ. యల్ పురం మేజర్ పంచాయతీ సర్పంచ్ అనకాపల్లి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు శ్రీమతి లోచల.సుజాత ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గౌ,,శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నందుకు అలాగే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ఇంతటి విలువైన రాజ్యసభ సీటును కేటాయించి మరియొక సారి ఎస్సీల పట్ల ఆయనకున్న ప్రేమను చాటుకొన్నారని అందుకు గాను గౌ,,రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ పరిచారు.అలాగే అయన ఋణం తీర్చుకోవటానికి ఎస్సీ సామాజిక ప్రజలందరు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.