*అనకాపల్లి జిల్లా పోలీసు*9tv Digital
రానున్న సార్వత్రిక ఎన్నికలు సంధర్బంగా సెక్టార్ ఇంఛార్జి పోలీస్ అధికారులకు విధులు, ఎన్నికల నియమావళి అవగాహన కల్పించడంలో భాగంగా పరీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్
*అనకాపల్లి, ఫిబ్రవరి 15:* రానున్న సార్వత్రిక ఎన్నిక సందర్భంగా అనకాపల్లి జిల్లాలో 158 సెక్టర్లు గా విభజించి పోలీస్ అధికారులను కేటాయించారు. ఈ సెక్టర్ లలో సంబంధిత అధికారులు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సెక్టర్ పరిధిలోని గ్రామాల్లో పటిష్ట చర్యలు చేపట్టేందుకు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో దఫదఫాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సెక్టర్ అధికారుల విధులు, బాధ్యతలు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి సెక్టర్ పోలీస్ ఆఫీసర్లు ఎంతవరకు అవగాహన పెంపొందించుకున్నారనే విషయమై ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు అనకాపల్లి జిల్లాలో హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ మరియు ఎస్సైలు ఈ రాత పరీక్షలో పాల్గొన్నారు.
ఈ సదర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ముందస్తుగా సెక్టర్ పోలీస్ అధికారులకు తమ పరిధిలోని గ్రామాల్లో వారు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా ఎన్నికలు సజావుగా జరిగేందుకు దోహదపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ బి.విజయభాస్కర్, ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, అప్పలనాయుడు, కుమారస్వామి, ఎస్సైలు నాగ కార్తీక్, సావిత్రి, దివ్య మరియు జిల్లా లోని సెక్టర్ ఇంచార్జ్ అధికారులు పాల్గొన్నారు.
*జిల్లా పోలీస్ కార్యాలయం,* *అనకాపల్లి.*