జిల్లా పరిషత్తు రెండవ స్థాయి సమావేశంలో గొలుగొండ జడ్పిటిసి సుర్ల వెంకట గిరిబాబు

 


ఈరోజు జిల్లా పరిషత్ రెండవ స్థాయి సమావేశంలో జడ్పిటిసి గిరిబాబు మాట్లాడుతూ DRDA శాఖకు సంబంధించి చర్చిలో వైయస్సార్ పెన్షన్ కానుక 3 వేల రూపాయలు పెంపు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు తెలుపుతూ ఏవైతే వెరిఫికేషన్ పూర్తయి పెండింగ్లో ఉన్న వారి పెన్షన్స్ కూడా త్వరగా టెక్నికల్ ఇష్యూస్ పరిష్కరించి వారికి కూడా పెన్షన్ అందేలా ఇచ్చేలాగా చూడాలని కోరారు. Deama PD గారితో చెరువుల పూడికతీతలకు బదులు పండ్లతోటల పెంపకం మరియు జీడి మామిడి తోటల ట్రెంచెస్ తవ్వకం, అదేవిధంగా పంట కాలువల పూడుకతీతలు చేపట్టేటట్టు ఎస్టిమేషన్స్ తీసుకోవాలని ఉపాధి హామీ పనులను రైతులకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కోరడం జరిగింది. హౌసింగ్ శాఖ సంబంధించి గ్రామీణ పథకం కింద ఇచ్చిన ఇళ్ళ యొక్క పెండింగ్ బిల్స్ పేమెంట్స్ పూర్తి చేయాలని. కోరడం జరిగింది