గొలుగొండ మండలంలో ఘనంగా ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి

 ఘనంగా ఎన్టీఆర్ 28 వ వర్ధంతి ఘన నివాళి పేదలకు బట్టలు పంపిణీ

గొలుగొండ జనవరి 18 9tv Digital మండలంలో గొలుగొండ,ఎ ఎల్ పురం, సిహెచ్ నాగపురం పంచాయతీ లో ఎన్టీఆర్ 28 వ వర్ధంతి ఘన నిర్వహించారు.‌ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి, విగ్రహాలకు పువ్వులమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు ఆద్వర్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ నలుమూలల తెలుగు వారి ఆత్మ గౌరవం కీర్తిని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. పేదవాడికి కూడు, గుడ్డ, గూడు ఉండాలి అన్నా ఏకైక సంకల్పంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు అన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు ఎన్టీఆర్ ఆలోచన విధానాన్నే అమలు చేస్తున్నారు అన్నారు. పేదలకు పెన్షన్ కిలో రెండు రూపాయల బియ్యం అందించి ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. ఎ ఎల్ పురం లో మాజీ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ 40 మంది పేదలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎ ఎల్ పురం టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గొలుగొండ మండల కేంద్రం లో జరిగిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చిటికెల సాంబమూర్తి కొల్లు రాంబాబు సుర్ల సీతారాంమూర్తి గెడ్డం ఆనంద్ మాజీ సర్పంచులు ఎం పి టి సి లు పాల్గొన్నారు.