గొలుగొండ మండలం పాకలపాడు లో వై ఏపీ నీడ్స్ జగన్


 గొలుగొండ మండలం పాకలపాడు లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ధి ని ప్రజలకు వివరించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం పాకలపా డు గ్రామంలో సర్పంచ్ రాజాన పద్మ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పిటిసి సుర్ల వెంకటగిరి బాబు మాట్లాడుతూ

రాష్ట్రంలో ప్రజలు అందరికీ పారదర్శకంగా ప్రారంభిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు అనంతరం ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ప్రజలకు వివరించారు పార్టీ అధ్యక్షులు లెక్కలు సత్యనారాయణ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాలో అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కింది అని అన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగాలన్న ఏపీకి జగన్ కావాలి అని అన్నారు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి ఏపీకి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జలకపు మణి కుమారి పార్టీ ప్రధాన కార్యదర్శి పత్తి రమణ కార్యకర్తలు వాలంటీర్స్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు