విజయోత్సవ ర్యాలీ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం

 విజయోత్సవ ర్యాలీల జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం

సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో

ముఖ్యఅతిథిగా విశాఖ రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు                                                  9tvDigital పాయకరావుపేట విశాఖ రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబుకు విజయోత్సవ ర్యాలీల జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జన సైనికులంతా ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు నూతనంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన పంచకర్ల రమేష్ బాబు పాయకరావుపేట మొదటిసారిగా వచ్చినందుకు స్థానిక నర్సీపట్నం రోడ్డు వద్ద నుండి జన సైనికులంతా ఘనస్వాగతం పలికి రోడ్ షో నిర్వహించి ఆయనపై పూల వర్షం కురిపించారు. అదేవిధంగా జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ జనసేన జెండాలను రెపరెపలాడించారు. తద్వారా స్థానిక దాసరి గున్నయ్య


చెట్టు కళ్యాణ మండపం వద్ద విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్య అతిథులు అందరినీ దళిత నాయకులు పల్లి దుర్గారావు ఆహ్వానించగా వారిని బొకేలతో స్వాగతించారు. ఎక్కడ మొదలైంది వైసీపీ పార్టీని ఎండబెట్టడం వారు చేస్తున్న అన్యాయాలను ఎదిరించడం జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం గా పెట్టుకొని వచ్చే నెల ఒకటో తేదీ నుండి జనసేన పార్టీ ప్రజల్లో మమేకమై వైయస్సార్ పార్టీ చేస్తున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేసి వైఎస్సార్ పార్టీ గెలుపుకు జనసైనికులు అంతా సిద్ధంగా ఉండాలని రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు పిలుపునిచ్చారు. అదేవిధంగా నాయకులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ అభిమానిగా చిరంజీవి సేవా సమితి ఏర్పాటు చేసి పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న నాయకులు గెడ్డం బుజ్జికి అభినందనలు తెలిపారు. అలాగే జి. సి. ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామాలలో గుడి, బడులను అభివృద్ధి చేయాలని దాని వలన ఆ గ్రామమే అభివృద్ధి చెందుతుందని నమ్మకం కలిగిన వ్యక్తి గెడ్డం బుజ్జి అన్నారు. అదేవిధంగా చిరంజీవి ఏర్పాటుచేసిన ప్రజారాజ్యం పార్టీ నుండి నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల అవసరాలను తీరుస్తూ అధిష్టానం ఎలా చెప్తే అలాగా చేసుకుంటూ ముందుకు పోయారని ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు పనిచేస్తున్న గెడ్డం బుజ్జికి నిజంగా పార్టీ అధిష్టానం రుణపడి ఉంటుందని అన్నారు. ఇదిలా ఉండగా స్టేజ్ పైన ఉన్న జనసేన పార్టీ నేతలంతా 2014 నుండి పార్టీలో ఉంటూ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామని అన్యాయంగా కేసుల్లో ఇర్పిస్తున్నారని ఈసారి తప్పకుండా జనసేన పార్టీకి పాయకరావుపేట ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని నాయకులు పంచకర్ల రమేష్ బాబుకు తెలియజేశారు. అలాగే నాయకులు గెడ్డం బుజ్జి మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న నా జన సైనికులకు న్యాయం చేయాలంటే ఈసారి పాయకరావుపేట టికెట్ను జనసేనకు కేటాయించాలని నాయకులు పంచకర్ల రమేష్ బాబుకు తెలియజేయగా ఆయన మాట్లాడుతూ ఇంత ఘన స్వాగతం పలికిన జన సైనికులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని తెలియజేస్తూ తప్పకుండా మీ యొక్క అందరి అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఇక నుండి పార్టీ కార్యక్రమాల్లో నాయకులు గెడ్డం బుజ్జి, నేను ఉంటామని పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయటానికి ముందుకు పోతామన్నారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట జనసేన పార్టీ టికెట్ ఆశించిన వ్యక్తులు రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివధత్, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి, ప్రముఖ వ్యాపారవేత పెద్దడ రమణ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.