నిరాశ్రయులకు అండగా ఎం.వి.ఆర్ ట్రస్ట్

  నిరాశ్రయులకు అండగా ఎం.వి.ఆర్ ట్రస్ట్ నిలుస్తుందని నియోజకవర్గ ఇన్చార్జి నానాజీ తెలియజేశారు.


    9tv Digital గొలుగొండ మండలం గుండు పాల గ్రామంలో ఇటీవల గ్యాస్ సిలిండర్ పేలి నష్టపోయిన కుటుంబానికి ఎం వి ఆర్ ట్రస్టు ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం, నిత్యవసర సరుకులు ఆదివారం అందజేశారు. అనకాపల్లి జిల్లాలో ఎక్కడైనా ప్రజలకు నష్టం వాటిల్లితే అక్కడ ఎం.వి.ఆర్ సంస్థ ద్వారా ఆదుకుంటామని అన్నారు. ఇప్పటికే జిల్లాలో పలుసంక్షేమ కార్యక్రమాలు లో భాగంగా దేవాలయాలు అభివృద్ధి, అంబులెన్స్ ఏర్పాటు, విద్యా వైద్య పరంగా అందుకోవడం పేద ప్రజలను గుర్తించి నిత్యావసర వస్తువుల అందించటం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ పి ఆర్ ఓ సతీష్ కుమార్, సూర్య తదితరులు పాల్గొన్నారు.