సీఎం సహాయనిది మంజూరు చేసిన ఎమ్మెల్యే గణేష్ గారికి కృతజ్ఞత తెలుపుకున్న కుటుంబ సభ్యులు



అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చనిపోయిన కార్యకర్త కుటుంబానికి 2లక్షలు ఆర్థిక సహయం అందజేసిన ఎమ్మెల్యే గణేష్* అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం CH. ఎర్రవరం గ్రామానికి చెందిన YSR కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పట్నాలు లవకుశ ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. తదనంతరం, ఆ కుటుంబ సభ్యులు నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమా శంకర గణేష్ ని సంప్రదించగా, వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందిగా ఉండటంతో ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ చొరవ తీసుకొని ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 2 లక్షల రూపాయలను మంజూరు చేసారు. దీనికి సంబంధించిన 2 లక్షల రూపాయల చెక్కును ఆ కుటుంబ సభ్యులకు ఉమా శంకర్ గణేష్ బొడ్డేపల్లి పార్టీ కార్యాలయంలో గొలుగొండ మండలం జడ్పిటిసిిి సుర్ల వెంకట గిరి బాబుపార్టీ నాయకులు సమక్షంలో చెక్కు ఇవ్వడం జరిగింది. ఈ సంధర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించినట్లు తెలియజేస్తూ, ఆర్థిక సహకారం అందించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మరియు ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.