9tvDigital గొలుగొండ మండలం గొలుడొండ మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ కసిపెల్లి అప్పారావు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో గాంధీ గారు పోషించిన పాత్ర చాలా గొప్పదని పేర్కొన్నారు. గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గాంధీజీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్య ఆశయం ఆచరణలోకి తీసుకొచ్చిన వ్యక్తి *జగన్మోహన్ రెడ్డి గారు* అన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఏర్పాటు అవుతున్న గ్రామ సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పాఠశాలల నిర్మాణం ఇవన్నీ కూడా గ్రామ స్వరాజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తున్న అడుగులు అన్నారు. మన వంతు బాధ్యతగా ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ టివి రమణ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వంశీ స్వచ్ఛభారత్ ఎంసీఓ మాధవ సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ పాల్గొన్నారు