దోమలు నివారణకు చర్యలు చేపట్టండి జనసేన డిమాండ్


 
9tvDigital గొలుగొండ మండలం దోమ  కాటుకు గురై డేంగ్యూ, మలేరియా మరియు విష జ్వరాలు తో అల్లుడి పోతున్నారు వర్షాలు అధికం గా కురవడం తో డ్రైనేజీ కాలువల్లో ఉన్న మురుగు పెరిగి పోయి దోమలు మోత ప్రజలను అల్లాడిపోతున్న ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ప్రమాదం ఉందని జనసేన పార్టీ మండల సీనియర్ నాయకులు రేగుబళ్ళు సాంబశివ మండల పార్టీ అధ్యక్షులు గడెం దొరబాబు ఆందోళన వ్యక్తం చేశారు.. శనివారం కృష్ణా దేవి పేటలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య సమస్యలు వెంట ఆడుతున్న వైసిపి ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదన్నారు.ప్రజలు ప్రాణాలు తో ఈ ప్రభుత్వం చేలగాటం ఆడుతుంది అన్నారు.కనీసం పంచాయతీ అధికారులు సైతం ఏమాత్రం స్పందించకపోవడం ఏమిటి అన్నారు.బ్లీచింగ్, ఫోగింగ్ దోమలు నివారణ చర్యలు చేపట్టాలని లేదంటే ప్రజలు మరింత గా విష జ్వరాలు భారిన పడతారు అన్నారు. జగనన్న సురక్ష పేరు తో సభలు సమావేశాలు అధికారులు ఏర్పాటు చేసుకొని చేతులు దులుపేసుకుంటున్నారు. ప్రజలను దోమలు భారి నుంచి కాపాడాలని పంచాయితీల్లో శానిటేషన్ పనులు చేపట్టాలని సాంబశివ దొరబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.