గొలుగొండలో జగనన్నకు చెబుదాం జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి


ప్రతి సమస్యను వేగంగా పరిష్కరించాలి 

జిల్లా కలెక్టర్ 

రవిపట్టన్ శెట్టి

9tv Digital   గొలుగొండ.,సెప్టెంబరు 22: జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో వచ్చిన అర్జీ లన్నింటిని వేగంగా పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటి గూర్చి వివరణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు.  

 ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి జిల్లాలో జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమం శుక్రవారం గొలుగొండ మండలంలో నిర్వహించారు. మండలంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి వారి సమస్యలను కలెక్టర్ కు విన్నవించుకున్నారు. స్పందన కార్యక్రమానికి 186 వినతులు వచ్చాయి. సమస్యలలో ఎక్కువగా  భూతగాదాలు భూమి పట్టాలు ఇవ్వాలని ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని,తాగునీరు, సాగునీరు, దగ్గరలో వైద్య, పశు వైద్య సదుపాయాలు కావాలని విన్నవించుకున్నారు.                                                 ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి  నర్సీపట్నం అడిషనల్ ఎస్పీ  అధిరాజ్ సింగ్ రాణా, నర్సీపట్నం ఆర్డిఓ జయరాం, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి మంజుల వాణి,  అర్జీలను స్వీకరించారు.  వివిధ శాఖల  జిల్లా అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.