కలెక్టర్ గారి దృష్టికి ఏ ఎల్ పురం మేజర్ పంచాయతీ సమస్యలను తీసుకెళ్లిన సర్పంచ్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల సుజాత.
9tv digital అనకాపల్లి జిల్లా,గొలుగొండ మండలంలో జరిగిన "జగనన్నకి చెబుదాం" స్పందన కార్యక్రమంలో గ్రామ ప్రజలు,పెద్దలు నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిటికెల.భాస్కర నాయుడు గారి విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసు కెళ్లిన ముఖ్యమైన సమస్యలు గ్రామంలో గల ఆర్ అండ్ బి రోడ్డుకి ఇరువైపులా గల డ్రైనేజీ నిర్మాణం, ఇంకనూ అర్హులైన జగనన్న లబ్ధిదారులకు స్థల మంజూరు కొరకు, గ్రామము లో గల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్థల ఆక్రమణకు గురి కాకుండా ఆ స్థలములో వారపు సంత నిర్వహించు కొనుటకు అనుమతి నిమిత్తం, గ్రామములో గల స్మశాన వాటికకు సి.సి.రోడ్ నిర్మాణం సుమారు 175 డ్వాక్రా గ్రూపులకు సమావేశములు నిర్వహించు కొనుటకు, మహిళా సాధికారిత భవన్ నిర్మాణము కొరకు,మరి ముఖ్యంగా సచివాలయము లో ఖాళీగా ఉన్న డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు(2) వెల్ఫేర్ అసిస్టెంట్(1),లైన్ మాన్ పోస్టులు(2),ఖాళీగా ఉండటం వలన ప్రజలు చాల ఇబ్బంది పడు తున్నారని వాటిని శాశ్వత ప్రాతి పదికన పూర్తి చెయ్యాలని సర్పంచ్, సుజాత బుల్లి ప్రసాద్ కోరడం జరిగింది.