విశాఖ జూ పార్కు వద్ద తోపుడు బండ్లను అటవీ శాఖ అధికారులు తొలగించడం అన్యాయం. సిఐటియు

                                   


  9tv digital    విశాఖ. జూ పార్క్ నుండి పీఎం పాలెం స్టేడియం వరకు ఉన్న 40 తోపుడుబళ్లను అటవీశాఖ అధికారులు తొలగించ వద్దని గాంధీ విగ్రహం వద్ద సిఐటియు నాయకత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా చిల్లర వర్తకుల కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏ.సింహాచలం మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి తోపుడుబండ్లు, చిన్న చిన్న బడ్డీలు పెట్టుకుని చిల్లర వర్తక కార్మికులుగా 40 కుటుంబాలు బ్రతుకుతున్నాయి. ఈ తోపుడు బండ్లు వ్యాపారమే ఈ కుటుంబాలకు ఆధారమని, ఉపాధి అవకాశాలు లేక స్వయం ఉపాధిగా తోపుడిబండ్లపై వేలాది కుటుంబాలు ఈ నగరంలో బ్రతుకుతున్నాయి. వారిపై ఒక ప్రక్క జీవీఎంసీ అధికారులు, మరో ప్రక్క ట్రాఫిక్ అధికారులు, ఇక్కడ అటవీశాఖ అధికారులు దాడులతో వీరి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నాయి. తోపుడు బండ్లు కార్మికులను బ్రతికే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తున్నాం.
రోజంతా కష్టపడినా అతి తక్కువ ఆదాయంతో ఈ కుటుంబాలు బ్రతుకుతున్నాయి. ఒక ప్రక్క నిత్యవసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరో ప్రక్క పేదలపై కరెంటు చార్జీలు రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా పెంచింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆదాయం సరిపోక అప్పులతో వీరి కుటుంబాల ను పోషించుకుంటున్నాయి. దీనికి తోడు తోపుడు బండ్లు కార్మికులపై దాడులు విపరీతంగా పెరిగాయి..జాతీయ స్ట్రీట్ వండర్స్ చట్టం ప్రకారం రోడ్డు ప్రక్కన బ్రతికే చిల్లర వర్తకుల కార్మికులకు రక్షణ కల్పించాలి. హాకర్ జోన్స్ ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు కూడా తోపుడు బండ్లు కార్మికులకు రక్షణ కల్పించాలని డైరెక్షన్ ఇచ్చింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ,జీవీఎంసీ అధికారులు కానీ, అటవీశాఖ అధికారులు కానీ తోపుడు బండ్లు కార్మికులపై దాడులు చేసి తొలగిస్తున్నారు.

జూపార్కు రోడ్ లో ఉన్న తోపుడు బండ్లు ను తొలగిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. తోపుడు బండ్లు కార్మికులకు ఉపాధి రక్షణ కల్పించాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా తోపుడు బండ్లు, సిఐటియు మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి.వెంకటరావు, జూ పార్కు తోపుడు బండ్లు కార్మికుల అధ్యక్ష, కార్యదర్శులు ఏ.కిరణ్ కుమార్, ఎస్.లక్ష్మణ్, జూ పార్క్ తోపుడు బండ్లు నాయకులు ఎన్.ధనుంజయరావు, పి. రమణ మొత్తం తోపుడు బండ్లు కార్మికులు పాల్గొన్నారు.