జగనన్న ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి వైద్యం

 “జగనన్న ఆరోగ్య సురక్ష” రాష్ట్ర ప్రజలకు ఒక వరం 

ప్రతి ఇంటికి వైధ్యులు

 9tvDigital జగనన్న ఆరోగ్య సురక్ష రాష్ట్ర ప్రజలకు ఒక వరంలాంటిదని దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గజ్జలకు మణికుమార్ అన్నారు. గొలుగొండ పిహెచ్ సి పరిధిలో పుత్తడిగైర్యం పేటలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం ప్రారంభం అయిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ, మండల సచివాలయాల కన్వీనర్ కొరుప్రోలు ఫణి శాంత రాం,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచుల సుజాత, పుత్తడిగైరం పేట సర్పంచ్ పత్తి రమణ పాల్గొన్నాని ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.

           ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రభుత్వం వచ్చాక ఎన్నో ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉండే విధంగా చాలా మార్పులు చేర్పులు చేసి,ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం చేపట్టారని అన్నారు. ప్రతి ఇంటికి వైద్యులు వెళ్లి ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, ఈ కార్యక్రమం 45 రోజులు ఉంటుందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలనిఅన్నారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, ఈ ప్రభుత్వం వైద్యం ప్రజలందరికీ దగ్గరగా అందుబాటులో ఉండే విధంగా చేసిందని, చేస్తుందని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఇంకా దగ్గర అయిందని ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ అశ్విని శైలజ,డాక్టర్ గాయిత్రి, జిల్లా నుంచి వచ్చిన వైద్య సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్, సూపర్వైజర్లు, ఏఎన్ఎమ్స్, సిబ్బంది సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.