ఈనెల 23న నర్సీపట్నం కి ముఖ్య నాయకులకు ఆహ్వానం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం.
రిజర్వేషన్లు సక్రమ అమలు, అట్రాసిటీ చట్టం లో 41 ఏ నోటీసు రద్దు,దగా పడుతున్న దళితుల భద్రత, హాస్టళ్లకు సన్నబియ్యం, మా నిధులు మాకే ఖర్చు పెట్టండనే తదితర డిమాండ్లతో కూడిన దళిత ప్రతినిధుల గర్జన పోస్టర్ ను డి.ఎస్.పి (దళిత సేవా పరిరక్షణ) జిల్లా అధ్యక్షులు యాదగిరి దాసు, డీకే ఎస్ ఎస్ (దళిత కులాల సంక్షేమ సేవా సంఘం) జిల్లా అధ్యక్షులు చిట్ల చలపతి ఆధ్వర్యంలో స్థానిక కృష్ణా ప్యాలెస్ లో ఆదివారం ఉదయం విడుదల చేశారు. అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల ప్రతినిధులు, విశాఖపట్నంలోని సీనియర్ దళిత ఉద్దండులు మాత్రమే కార్యక్రమానికి హాజరు అవ్వాలని ఆహ్వానాలు పంపామని చెప్పారు. దళితులు రాజకీయ పార్టీల పోరాటాల్లో సమిధలుగా మారడాన్ని వారు వ్యతిరేకించారు.తమ హక్కుల్ని కోల్పోతున్న అన్న స్పృహలోకి రాకపోవడం దారుణమైన చర్యగా పేర్కొన్నారు. కార్యక్రమంలో బలిఘట్టం నుండి మల్లవరపు సతీష్, కోడి నాగరాజు, నర్సీపట్నం నుండి మంగళగిరి మౌళి, మంగళగిరి నాగేంద్ర కుమార్, పెదబొడ్డేపల్లి నుంచి నగేష్,రమ్య తదితరులు పాల్గొన్నారు.