*దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ మార్రా చంద్రశేఖర్, ప్రముఖులు హాజరు*
అనకాపల్లి
*జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో నాలుగు రోడ్ల కూడలిలో అంబేద్కర్ విగ్రహం వద్ద "దళిత ప్రతినిధుల గర్జన" పోస్టర్ ను దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ మార్రా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు*. *సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో దళిత సేవా పరిరక్షణ(డి యస్ పి)జిల్లా అధ్యక్షులు యాదగిరి దాసు, ప్రధాన కార్యదర్శి రేబాక మధుబాబు, డీకే ఎస్ ఎస్ జిల్లా అధ్యక్షులు చిట్ల చలపతి, రాష్ట్ర దళిత నాయకులు బంగారు వెంకటేశ్వరరావు,జిల్లా దళిత నాయకులు గోడి వెంకటేశ్వరరావు, కటుమూరి మంగరాజు,పందిరి దయాళ్ రాజు, డాక్టర్ జామి శ్రీనివాస్ రావు (సింగర్ రాజు), గంట్యాడ రమణ బాబు* *పాల్గొన్నారు. అట్రాసిటీ చట్టం లో 41 ఏ నోటీస్ రద్దు చేయాలని, రిజర్వేషన్లు సక్రమ అమలు, దళితులపై దాడులు అరికట్టాలని, వారి నిధులు వారికే కేటాయించాలని, తదితర డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు విలేకరులకు తెలిపారు*.