మహిళా బిల్లుకు ఆమోదం తెలపడం హర్షణీయం


 గొలుగొండ  మండలం సెప్టెంబర్ 19  పరిమితమైన మహిళా బిల్లును పార్లమెంట్లో ఆమోదించడం ఎంతో హర్షణీయమని అభినందనీయమని,వైస్ఎంపీపీ శ్రీమతి జక్కు నాగమణి పేర్కొన్నారు. మహిళా బిల్లు ఆమోదించడం వల్ల చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలవుతుందని దీనివల్ల ప్రజాస్వామ్యంలో మహిళలు మరింత భాగస్వాములుగా నిలబడే అవకాశం దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన ప్రతి పార్లమెంటు సభ్యులకు ధన్యవాదములు తెలిపారు .ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సిపి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం మహిళల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకొని మహిళ పక్షపాతి అని అనిపించుకొన్నారని ఆమె పేర్కొన్నారు. బిల్లును ప్రతిపాదించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.