మహారాష్ట్రలోని థానేలో ఉన్న బందోడ్కర్ కాలేజీలోని ఎన్సీసీ శిక్షణ కేంద్రంలో దారుణం జరిగింది. జూనియర్లకు శిక్షణనిస్తున్న ఓ సీనియర్.. వాళ్లు తన మాట వినలేదని కర్రతో గొడ్డును బాదినట్లు చితకబాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని ఆ కాలేజీ ప్రిన్సిపల్ సుచిత్ర నాయక్ తెలిపారు.