రోజు రోజుకి ఆడబిడ్డల మీద అత్యాచారాలు,హత్యలు పెరిగిపోతున్నాయి...ప్రేమ అంటారు ఒప్పుకోకపోతే చంపుతున్నారు
గుంటూరు :
Guntur # దారుణం #
ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . గుంటూరులో ఓ ఎయిడెడ్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని తనను ఓ యువకుడు వేధిస్తున్నాడని నాలుగు రోజుల క్రితం దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది . ఆ మరుసటి రోజే తనపై అత్యాచారం జరిగినట్లు తెలిపింది . దాంతో పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు . వారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి యువకుడిని అరెస్ట్ చేశారు.