పరిపూర్ణ ఆరోగ్యానికి...సంపూర్ణ పోషణ


ఇంటి వద్దకే పోషకాహారకిట్ల పంపిణీ ప్రారంభం.


వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పధకం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి అంబటి

 

సత్తెనపల్లి

గర్భిణీలు బాలింతలు చిన్నారుల పరిపూర్ణ ఆరోగ్యానికి సంపూర్ణ పోషణ పథకం దోహదపడుతుందని రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు అంబటి రాంబాబు అన్నారు బుధవారం నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ కొలిమి షమ్మీ అధ్యక్షత వహించారు .మంత్రి అంబటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యవంతమైన సమాజం కోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పోషకాహార ప్రాయోజిత కార్యక్రమం రూపొందించిందన్నారు. అంగన్వాడీల ద్వారా లబ్ధిదారుల ఇంటికే నేరుగా పోషకాహారాన్ని పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. తద్వారా ప్రసవాలు, చిన్నారుల , పోషకాహార లోపంతో జరిగే మరణాలను తగ్గించడంతోపాటు ఆరోగ్యవంతమైన సమాజానికి ఇది దోహదపడుతుందన్నారు. సుఖ ప్రసవాలు జరిగి, తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన వివరించారు.

 సిడిపిఓ టి శ్రీలత మాట్లాడుతూ  "వైఎస్సార్ సంపూర్ణ పోషణ" పథకంలో భాగంగా గర్భిణీలకు, బాలింతలకు, 6 నెలల నుంచి 72 నెలల్లోపు పిల్లలకు  నెలలో 25 రోజులు వేడి పాలు, అన్నం, పప్పు, కోడి గుడ్లు , మూడు కేజీల ఫోర్టీఫైడ్  బియ్యం, కేజీ కంది పప్పు, 5 లీటర్ల పాలు, 25 కోడి గుడ్లు, 1/2 కేజీ ఆయిలు రెండు కిలోల రాగి పిండి, కేజీ అటుకులు, పావు కిలో బెల్లం, పావు కిలో చిక్కిలు, పావు కిలో ఖర్జూర అందిస్తున్నారు. ఇలా ఒక్కో కిట్టుకు నెలకు ఒక్కొక్కరిపై రూ.850 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఆమె వివరించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతం నిర్వహించారు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోషకాహార స్థానం మంత్రి సందర్శించి ఆహార పదార్థాల పోషకాలను అడిగి తెలుసుకున్నారు.



కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ లు షేక్ నాగూర్ మీరాన్, రామావత్ కోటేశ్వరరావు నాయక్, పట్టణ కన్వీనర్ సహారా మౌలాలి, రూరల్ మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు, ఎం పి డి సత్యనారాయణ, కౌన్సిలర్ బండి రాజ్యలక్ష్మి, పల్నాడు జిల్లా మహిళా నాయకురాలు డా.గీతాహసంతి,  పక్కాలా సూరిబాబు, రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యులు కళ్లెం విజయభాస్కర్ రెడ్డి, పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు అచ్యుత శివప్రసాద్, ఎస్సీ సెల్ అధ్యక్షులు చిలక జైపాల్, , ఏ సి డి పి ఓ సంతోష్ కుమారి, ధూళిపాళ్ల సొసైటీ చైర్మన్ నలబోతు శివన్నారాయణ, అంగన్వాడీ సిబ్బంది, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు, తదితరులు ఉన్నారు