భూమిపూజ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు.
సత్తెనపల్లి:
రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చు చేసి ఐదువేల జనాభా దాటిన పంచాయతీలకు త్రీఫేస్ విద్యుత్తును నాణ్యవంతంగా సరఫరా చేస్తుందని, తద్వారా పల్లెల పారిశ్రామిక అభివృద్ధి, లో వోల్టేజ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు అన్నారు. బుధవారం మండలంలోని కొమెరపూడి గ్రామంలో త్రీఫేస్ విద్యుత్ సరఫరా ఏర్పాటు భూమిపూజా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ.. త్రీఫేస్ ద్వారా నిరంతరం గ్రామములో విద్యుత్ సరఫరా లభిస్తుందని వివరించారు. విద్యుత్ శాఖ నుంచి రూ.1.5 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిద్వారా విద్యుత్ శాఖకు ఆదాయం మెరుగుపడి, వినియోగదారులకు మేలు జరుగుతుందని ఆయన వివరించారు. ముందుగ శిలాఫలకాన్ని ఆవిష్కరించి పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు యర్రం వెంకటేశ్వర రెడ్డి, పల్నాడు జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ గజ్జల నాగభూషణ్ రెడ్డి, పక్కాల సూరిబాబు తదితరులు ప్రసంగించారు. రూరల్ మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు , రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యులు కళ్ళం విజయభాస్కర్ రెడ్డి, జడ్పిటిసి సభ్యురాలు సంకటి నాగేశ్వరమ్మ, విద్యుత్ డిఈలు శ్రీనివాసరావు, నిర్మాణ డిఈ శ్రీనివాసరావు, ఎంపీటీసీ సంకటి మహేంద్ర, ఉప సర్పంచ్ చల్లా శ్రీనివాసరెడ్డి, నాయకులు కరాలపాటి పకృద్దీన్, న్యూరిల్లా, మండల ఏఈ తిరుపతిరావు, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల బాధ్యులు తదితరులు ఉన్నారు