మల్లవల్లి రైతులకు అండగా ఉంటాం: పవన్‌ కల్యాణ్‌



మల్లవల్లి

కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి రైతులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. 2016లో పారిశ్రామికవాడ కోసం 1,460 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం..సాగుదార్లకు ఎకరాకు రూ.7.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, అర్హులమైనా తమకు పరిహారం రాలేదంటూ అప్పట్నుంచి కొందరు పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లవల్లి పారిశ్రామికవాడలో రైతులను పవన్‌ కలిశారు. రైతుల భూములు తీసుకున్న ప్రభుత్వం న్యాయమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు..

తెదేపా, భాజపా ముందుకు రావాలి..' కులాలు, పార్టీ, ప్రాంతాల వారీగా రైతులను విడదీయలేం. రైతుల్లో ఐక్యత లేకుంటే అనేక సమస్యలు వస్తాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక మల్లవల్లి రైతులు సమస్యలపై దృష్టి సారిస్తాం. రైతులపై దాడి చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. పరిస్థితులకు అనుగుణంగా పనిచేసే పోలీసులను నేను తప్పు పట్టను. ప్రభుత్వం, ఎమ్మెల్యేలు చెప్పినట్లే పోలీసులు వింటారు. మల్లవల్లి రైతులకు పరిహారం వచ్చే వరకు అండగా ఉంటాం. రైతుల ఇళ్లలోకి చోరబడితే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. 2016లో తెదేపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. మల్లవల్లి రైతులకు తెదేపా అండగా ఉండాలి.. భాజపా కూడా రైతులకు అండగా నిలబడాలి..