నెల్లూరు :
బోగోలు మండలం కొండ బిట్రగుంట గ్రామానికి చెందిన మందాడి మాల్యాద్రి పెద్ద కొడుకు మధుసూదన్ ఇటీవలే మృతి చెందాడు. మరో నాలుగు రోజుల్లో పెద్ద కర్మ ఉండటంతో బందువులంత మాల్యాద్రి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో మాల్యాద్రి చిన్న కొడుకు చంద్రమౌళికి తన వదిన మౌనికకు తలెత్తిన ఆస్తి వివాదం గొడవ కు దారి తీసింది. ఈ గొడవ లో మధుసూదన్ భార్య మౌనిక , ఆమె తండ్రి కృష్ణయ్య , అమ్మమ్మ ను హత్య చేశారు . ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు .