అర్ధరాత్రి ఫ్లై ఓవర్ కు వేలాడుతూ తమ ప్రాణాలు కాపాడాలని పోలీసులకు సమాచారం అందించిన బాలిక సకాలంలో స్పందించి ఫ్లైఓవర్ వద్దకు చేరుకొని బాలిక ప్రాణాలను కాపాడిన పోలీసులు
ఈ రోజు తెల్లవారు ఝామున 3 గంటల 50 నిమిషముల సమయంలో తాడేపల్లి ప్రాంతానికి చెందిన సురేశ్ అనే వ్యక్తి తనను(బాలిక), తన తల్లిని, చెల్లిని స్థానిక రావులపాలెం గౌతమి బ్రిడ్జిపై నుండి క్రిందకు తోసివేయడంతో నీటిలో పడుతున్న సమయమలో లో బాలిక కిందకు పడుతున్న క్రమంలో బ్రిడ్జికి ఉన్న ప్లాస్టిక్ పైపు పట్టుకుని వేలాడుతూ రక్షించమని DAIL 100 కి ఫోన్ చేసింది.
బాలిక నుండి సమాచారం అందుకున్న వెంటనే రావులపాలెం పోలీసులు సకాలంలో స్పందించి కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే dail 100 కి వచ్చిన నెంబర్ ఆధారంగా లొకేషన్(బ్రిడ్జి) వద్దకు చేరుకున్నారు. అప్పటికి బాలిక అత్యంత ప్రమాదకరం పరిస్థిలి బ్రిడ్జి పైప్ లైన్ కి వేలాడుతూ కనపడింది. ఒక పక్క బాలిక ఆత్మస్థైర్యం కోల్పోకుండా దైర్యం చెపుతూ మరో పక్క రెస్కు ఆపరేషన్ తో బాలికను అత్యంత చాకచక్యం గా రక్షించడం జరిగింది.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు:
తన పేరు లక్ష్మీ కీర్తన అని తన తనతల్లి తో సహజీవనం చేస్తున్న సురేష్ అందరం కలసి రాజమండ్రి వెళ్దామని చెప్పి కారులో రావులపాలెం బ్రిడ్జి వరకు తీసుకుని వచ్చి సెల్ఫి తీసుకుందాం అని మాయమాటలు చెప్పి తన, తల్లిని, తన చెల్లిని ముగ్గురిని ఉలవ సురేష్ బ్రిడ్జిపై నుంచి తోసి వేసినట్లు బాలిక తెలిపింది. పోలీసుల సహాయంతో తాను ప్రాణాలతో బతికినట్లు మిగిలిన ఇద్దరు నదీ ప్రవాహములో కొట్టుకొని పోయినట్లు బాలిక తెలిపింది.
గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు
గల్లంతైన లక్ష్మీ కీర్తన తల్లి, చెల్లి కోసం రావులపాలెం సీఐ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఒక బృందం గోదావరి లో బోట్ల సాయం తో బాలిక తల్లి, పాపం కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తూ రెండో బృందం రావులపాలెం SI ఆధ్వర్యంలో ఉలవ సురేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అదే విధంగా DAIL 100 కి సమాచారం తో సకాలంలో స్పందించి చిన్నారి ప్రాణాలను కాపాడిన రావులపాలెం పోలీస్ సిబ్బంది, హై పట్రోలింగ్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీధర్ .