ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత


 

తెలంగాణ :

ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు.

తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. గద్దర్ చనిపోయినట్లు ఆయన కుమారుడు సూర్య అధికారికంగా ప్రకటించారు. ఆయన 1949వ సంవత్సరం తుఫ్రాన్ లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు.