కడప జిల్లా : ప్రొద్దుటూరు మండలం, కానాపల్లె ఎస్సీ కాలనీలో దారుణ హత్య శుక్రవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి పై భాగంలో పడుకుని ఉన్న బాబు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపిన సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఎంత సేపటికి కిందికి రాకపోవడంతో భార్య పైకి వెళ్లి చూడగా భర్త రక్తపు మడుగులో ఉన్నట్లు తెలిపారు. పక్కింటి పై భాగంలో నుంచి దుండగులు వెళ్లినట్లు రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. |
యువకుని గొంతు కోసి చంపిన గుర్తుతెలియని దుండగులు
July 13, 2023