మంగళగిరి పరిధిలోని ఆటోనగర్ ఏపీఐఐసి భవనం లో ఉన్న ఆరోగ్య , కుటుంబ సంక్షేమ కార్యాలయం లో మంగళవారం అవినీతి శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయం లో సూపరిడెంట్ గా విధులు నిర్వహిస్తున్న లాతిక్ ఆహ్మద్ రూ. 16000/- లంచం తీసుకుంటు ఉండగా ఎ సి బి అధికారులు వలపని పట్టుకున్నారు. ఉద్యోగి బదిలీ నిమిత్తం లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.