కోర్టు ధిక్కరణ కేసులో IAS అధికారి ప్రవీణ్ కుమార్ కు హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనకు 2 వారాల సాధారణ జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. తీర్పు అమలును 4 వారాలకు వాయిదా వేసింది. గతంలో విశాఖ కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు భీమిలి మండలం కాపులప్పాడ పరిధిలో 7ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేశారని హైకోర్టులో శ్రీనివాసరావు అనే వ్యక్తి పిటిషన్ వేశారు.