రెండు స్కూల్ బస్సులు ఢీ , ఒక విద్యార్థికి స్వల్ప గాయాలు

 



పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడు  గ్రామంలో రెండు స్కూల్ బస్సులు ఢీకొని ఒక విద్యార్థికి స్వల్ప గాయాలు

దాచేపల్లికి చెందిన ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్సు, చైతన్య స్కూల్ బస్సు స్కూల్ విద్యార్థులను ఎక్కించుకునేందుకు వెళుతుండగా విద్యార్థులు ఎక్కించుకున్న శ్రీ చైతన్య స్కూల్ బస్సు గామాలపాడు పెట్రోల్ బంక్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా వెనుక వైపు నుంచి వస్తున్న ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్సు ఢీకొనడంతో శ్రీ చైతన్య స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి

అటుగా వెళుతున్న మున్సిపల్ చైర్మన్ కొప్పుల సుబ్బమ్మ సాంబయ్య స్పందించి విద్యార్థిని ప్రవేట్ హాస్పిటల్లో ప్రధమ చికిత్స నిమిత్తం చేర్చడం జరిగింది

ఆక్స్ఫర్డ్ స్కూల్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అంటున్న స్థానికులు