జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ షాక్


పోలవరం ప్రాజెక్టు పై సుప్రీంకోర్టులో జగన్
ప్రభుత్వా నికి షాక్ తగిలింది. పర్యావరణానికి కలిగిన నష్టా నికి ఎందుకు బాధ్యత తీసుకోరని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. న్యాయవాదుల  ఫీజులు చెల్లించడానికి డబ్బు వెచ్చిస్తున్న ప్రభుత్వం పర్యావరణ నష్టాన్ని ఎందుకు భరించదని నిలదీసింది. ..ఒక్క కేసుకు ఎంత మంది సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేస్తారని సుప్రీం ప్రశ్నించింది..

 

ప్రభుత్వాలకు న్యాయవాదులను రంగంలో దించడంపై ఉన్న ఆసక్తి పర్యావరణ పరిరక్షణ పైన లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. పులిచింతల ప్రాజెక్టుల పై ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై దాఖలు చేసిన అప్పీళ్ళను కలిపి వింటామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఇప్పటికీ ఇంకా ఉల్లాంఘనలు జరుగుతున్నాయని పిటిషనర్ డాక్టర్ పెంటపాటి పుల్లారవు తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ కోర్టుకు వివరించారు..