లోయలో పడిన టెంపో. 7గురు మృతి


బంజర్ వ్యాలీ‌ లో నిన్న అర్ధరాత్రి ఘోర
ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న టెంపో కొండపై నుంచి లోయలో పడిపోయిన ప్రమాదంలో 7గురు మృతి చెందారు. మరో పదిమంది క్షతగాత్రులకు వైద్యులు హాస్పిటల్‌లో చికిత్సను అందిస్తున్నారు. 

బంజర్ సబ్‌డివిజన్‌లోని ఘియాఘి సమీపంలో జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్న బంజర్‌ బీజేపీ ఎమ్మెల్యే సురేందర్ శౌరీహుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అదే సమయంలో అంటే అర్ధరాత్రి 12.45 గంటలకు ఫేస్‌బుక్ లైవ్‌ లో ఘటనకు సంబంధించిన వీడియోను ప్రసారం చేశారు. క్షతగాత్రులను మొదట బంజర్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి ప్రథమ చికిత్స అందించిన తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం కులు ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.