తెలంగాణ ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది. దీంతో అధికారులు ప్రజలు అప్రమత్తమయ్యారు.తెలంగాణలో మూడు రోజులుగా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ఎగువ నదీతీర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ 9 లక్షల క్యూసెక్కులకు చేరుతోందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. దీంతో సచివాలయంలో వెంటనే కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం గోదావరి అంతటా ప్రాజెక్టులకు భారీగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు 35 గేట్లు ఎత్తి నీటిని నదిలోకి వదిలారు. శ్రీరాంసాగర్ నుంచి దాదాపు 2.06 లక్షల క్యూసెక్కుల వరద విడుదలవుతోందిఇక మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి రిజర్వాయర్ 85 గేట్లను తెరిచి 6.7 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. మేడిగడ్డ వద్ద 8.2 లక్షల క్యూసెక్కుల వరద విడుదల అవుతోంది.గడిచిన రెండు నెలల్లో గోదావరికి వరదలు రావడం ఇది రెండోసారి. జులైలో సంభవించిన అపూర్వమైన వరదల కారనంగా పంటలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది.