సినిమా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కృష్ణంరాజు మరణ వార్త ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈయన 1940 జనవరి 20 న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఈయనకు భార్య శ్యామలాదేవి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఈయన మరణ వార్త ప్రభాస్ కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. ఇక ఈయన చివరిగా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాలో నటించారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు కృష్ణంరాజు సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు కృష్ణంరాజు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.