ఇక్కడ ఎన్టీఆర్ను అగౌరవపరిచింది ఏముంది? లక్ష్మీపార్వతి


ఎన్టీఆర్ పేరు.. హెల్త్ యూనివర్సిటీకి కావాలా? జిల్లాకి కావాలా?
అంటే తాను జిల్లాకే పేరు ఉండాలని కోరుకుంటానని లక్ష్మీపార్వతి చెప్పడం గమనార్హం. యూనివర్సిటీ కంటే జిల్లా చాలా పెద్దదని ఆమె అనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

తాజాగా లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. విజయవాడలో 25 ఏళ్లుగా ఎన్టీఆర్ పేరుతో హెల్త్ యూనివర్సిటీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాని పేరును మారుస్తూ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడానికి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శాసనసభ శాసన మండలిలోనూ బిల్లును ఆమోదించింది.

జగన్ నిర్ణయంపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు బాలకృష్ణ పురందేశ్వరి మొత్తం ఎన్టీఆర్ కుటుంబం తరపున ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ హీరోలు కల్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్గా ఉన్న లక్ష్మీపార్వతి సైతం జగన్ నిర్ణయాన్ని తప్పుబడతారని.. జగన్ తన నిర్ణయాన్ని పునసమీక్షించుకోవాలని కోరతారని వార్తలు వచ్చాయి. అయితే జగన్ నిర్ణయం తీసుకున్న వారం తర్వాత మీడియా ముందుకొచ్చిన లక్ష్మీపార్వతి జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడటం గమనార్హం.