షర్మిల ఆస్తుల పంపకం అది వైస్సార్ జయంతి రోజు

 


వైఎస్ షర్మిల ప్రతీ ఏటా తన తండ్రి జయంతి వర్ధంతులకు ఆమె తప్పనిసరిగా ఇడుపులపాయకు వచ్చి ఘన నివాళి అర్పిస్తూంటారు. ఈసారి కూడా ఆమె అలాగే వచ్చారు. ఒక్క రోజు ముందే ఆమె కడపకు వచ్చారు. శుక్రవారం ఆమె కడపకు చేరుకున్నారు.అక్కడ నుంచి ఆమె వేంపల్లి సబ్ రిజిష్టార్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఆమె చేసిన పని అందరికీ షాక్ కి గురి చేసింది. తన పేరిట ఉన్న ఆస్తులను ఆమె తన కుమార్తె కుమారుడి పేరిట మార్పించి రిజిస్ట్రేషన్ చేయడం విశేషం. ఇడుపులపాయలో తన పేరిట ఉన్న 9.53 ఎకరాల భూమిని తన కుమారుడు రాజారెడ్డి పేరిట షర్మిల రిజిస్ట్రేషన్ చేశారు.అదే విధంగా ఇడుపులపాయలో ఉన్న 2.12 ఎకరాల భొమిని తన కుమార్తె అంజలీ రెడ్డి పేరిట షర్మిల రిజిస్ట్రేషన్ చేశారని తెలిసింది. ఈ భూములను షర్మిల గతంలో ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూస్తే వెంగమునిరెడ్డి నుంచి కొనుగోలు చేశారని అంటున్నారు.


ఈ మొత్తం రిజిస్ట్రేషన్ పనులు పూర్తి అయ్యాకనే షర్మిల ఇడుపులపాయ ఎస్టేట్ కి చేరుకున్నారు. ఈ ఆస్తులతో పాటుగా హైదరాబాద్ లో తన పేరిట ఉన్న ఆస్తులను కూడా షర్మిల తమ బిడ్డలు ఇద్దరికీ పంచబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారంగా తెలియవచ్చింది. తండ్రి జయంతి వేళ ఇలా ఆస్తులను పంచడం చేస్తే మంచిదని పెద్దలు చెప్పిన మీదటనే షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారుట.


తన పేరు మీద ఉన్న ఆస్తులను ఇలా పంచడం ద్వారా షర్మిల ఏమి ఆలోచిస్తున్నారు అన్నది అర్ధం కావడం లేదు అంటున్నారు. అయితే తన వారసులకు ఆమె చాలా ముందుగానే ఆస్తులను అప్పగించారని అంటున్నారు. రాజకీయంగా ఆమె ఇపుడు కీలక దశలో ఉన్నారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారు అని ప్రచారం అయితే సాగింది. కానీ మరో సంచలన నిర్ణయమే ఆమె తండ్రి జయంతి వేళ తీసుకున్నారు అని అంటున్నారు.


ఆమె రాజకీయంగా కూడా రానున్న రోజూల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడానికే ఇలా చేశారా అన్న చర్చ కూడా సాగుతోంది. అన్న జగన్ తో ఆమెకు విభేదాలు ఉన్నాయన్న వార్తల నేపధ్యంలో ఉదయం షర్మిల మధ్యాహ్నం జగన్ ఇడుపుల పాయలో తండ్రికి వేరు వేరుగా నివాళి అర్పిస్తున్నారు.