37వేల అడుగుల ఎత్తులతో ఇద్దరు పైలెట్లు నిద్రపోయిన వైనం


సూడాన్ లోని ఖర్టౌమ్ నుంచి ఇథియోపియా రాజధాని ఆ
డీస్ అబాబా బయలు దేరిన ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737  విమానం ఆకాశంలో ప్రయాణిస్తుండగా.. ఇద్దరు పైలెట్లు 37 వేల అడుగుల ఎత్తులో అలసిపోయి నిద్రపోయారు. ల్యాండింగ్ కు ఎయిర్ పోర్ట్ దగ్గరపడినా నిద్రలేవలేదు. ఫ్లైట్ ను ఆటోపైలెట్ మోడ్ లో పెట్టేసి వీరిద్దరూ నిద్రపోయారు.

ఎయిర్ పోర్ట్ సమీపంలోకి వచ్చాక ఏటీసీ అప్రమత్తం చేసింది. అయినా పైలెట్లు నిద్ర లేవలేదు. చివరకు ఎయిర్ పోర్ట్ సమీపించినా 37వేల అడుగుల ఎత్తులోనే విమానం ప్రయాణిస్తుండడంతో అనుమానం వచ్చిన ఏటీసీ పైలెట్లు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం దక్కలేదు.

విమానాన్ని ఆటోపైలెట్ సిస్టమ్ లోనే ఉంచడంతో విమానం సూచించిన ఎత్తులోనే ప్రయాణిస్తోంది. అయితే ల్యాండ్ అవ్వాల్సిన రన్ వేను దాటిపోయిన తర్వాత ఆటోపైలెట్ సిస్టమ్ దానంతట అదే ఆగిపోయింది. ఈ విమానంలో అదే జరిగింది. చివరకు అలారమ్ మోగడంతో వీరిద్దరూ నిద్రలేచారు. నిద్రలేచి చూసుకుంటే ల్యాండ్ కావాల్సిన ఎయిర్ పోర్ట్ దాటేసింది. దీంతో వారు అధికారులతో సంప్రదించారు. చివరకు 25 నిమిషాల తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఇదే విషయాన్ని విమానయాన పర్యవేక్షణ సిస్టం ‘ఏడీఎస్ డి’ డేటా కూడా నిర్ధారించింది. విమానం ప్రయాణించిన ఫొటోను కూడా విడుదల చేసింది. విమానం గాల్లో రౌండ్లు కొట్టిన మార్గం ఫొటోలో కనిపించింది. ఈ ఇద్దరు పైలెట్లపై చర్యలు తీసుకునేందుకు ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ సిద్ధమైంది.