ఏపీపై కేంద్రం ఏదో చేయబోతోందనే వాదనకు బలం చేకూరుతోందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇంకో వైపు.. రాజకీయంగా కూడా కేంద్రానికి-రాష్ట్రానికి మధ్య గ్యాప్ పెరుగుతుండడం గమనార్హం.
ఇదంతా కూడా ఏపీలో మారుతున్న రాజకీయాలకు పరాకాష్టగా చెబుతున్నారు. ఇప్పటికే.. ఒక ఎంపీ విషయంలో కేంద్రం సీరియస్గా ఉందని.. ఢిల్లీ ప్రభుత్వంతో కుమ్మక్కయి.. లిక్కర్ మాఫియాతో చేతులు కలిపారంటూ.. కొన్ని రోజుల కిందట ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే.. దీనిపై ఎవరూ స్పందించలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న ఐదుగురు వరకు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రాధమికంగా తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న ఐదుగురు వరకు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రాధమికంగా తెలుస్తోంది. హా వాదన తెరమీదికి వచ్చింది. తీర ప్రాంతం లో లభించే ఓ ఖనిజాన్ని కొందరు విదేశాలకు తరలించారని.. టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు.
అదేసమయంలో రాష్ట్రంలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయనే అంశం పై కూడా కేంద్రం దృష్టి పెట్టిందని అంటున్నారు. .ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా వారిపై ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేయొచ్చని.. ఢిల్లీలోని ఏపీ రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ప్రస్తుతం గుంభనంగా ఉన్న రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా మారుతుందని కూడా చెబుతున్నారు...