GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్


జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెనాలిలో నిర్వహించిన ప్రెస్ మీట్.

ఆంధ్రప్రదేశ్ రహదారుల దుస్థితిని తెలియచేసేందుకు జనసేన పార్టీ

జులై 15, 16, 17 తేదీల్లో కార్యక్రమం

రాష్ట్రంలో రహదారులు కనీస మరమ్మతులు కూడా కాలేదు.. గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి గారిని నిద్ర లేపేందుకే #GoodMorningCMSir కార్యక్రమం

డిజిటల్ క్యాంపెయిన్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పాల్గొంటారు ఫోటోలు, వీడియోలు స్వయంగా డిజిటల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు

#GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో రహదారుల దుస్థితిపై జనసేన వీర మహిళలు నాయకులు, జన సైనికులు ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసే కార్యక్రమం 

గ్రామాలు, మండలాల్లో రహదారుల దుస్థితిని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం..

రోడ్డు మరమ్మత్తుల కోసం అని చెప్పి ఎక్కువ వడ్డీలకు నిధులు తెచ్చి ఆ సొమ్ములు మళ్లించేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం మభ్యపెడుతోంది...

పెట్రోల్ మీద ఏటా సామాన్యుడి నుంచి రూ. 750 కోట్లు రోడ్ సెస్ వసూలు చేస్తున్నారుఆ సెస్ చూపి రూ. 6 వేల కోట్లు అప్పులు తెచ్చారుముఖ్యమంత్రికి జవాబుదారీతనం ఉంటే ఆ నిధులు ఎందుకు ఖర్చు చేశారో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి...

ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను జనసేన పార్టీ తిప్పికొడుతుంది..

తెనాలి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ పోస్టర్ విడుదలచేసారు..