జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలోకి వెళ్లకుండా ఏ శక్తీ ఆపలేదు అని జనసైనికులు చెబుతున్నారు. ఇక్కడ బలమైన కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. అదే టైమ్ లో వారంతా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. వివిధ రకాలైన యూ ట్యూబ్ ఛానళ్ళ అభిప్రాయ సేకరణలో ఈ విషయం బయటపడుతోంది.పిఠాపురంలో పవన్ నామ స్మరణ ఎక్కువగా వినిపిస్తోంది. పవన్ కనుక పిఠాపురం నుంచి బరిలోకి దిగితే పార్టీలు ఏవీ అన్నది చూడామని అంతా ఆయనకే ఓట్లేస్తామని యవ జనాలు అంటున్నారు.
పిఠాపురంలో జనసేనకు మంచి క్యాడర్ కూడా ఉంది. ఎంపీటీసీ సీటు కూడా ఆ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలిపించుకుంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పట్ల వ్యతిరేకత బాగా కనిపిస్తోంది అని అంటున్నారు. ఆయన మూడేళ్ళుగా జనాలకు దూరంగా ఉన్నారని పెద్దగా దేనికీ రెస్పాండ్ కారని ప్రచారం అయితే ఉంది.
మరో వైపు చూస్తే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే గతం కంటే ఎక్కువ ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఈసారి అభ్యర్ధి ఎవరైనా కచ్చితంగా యాభై వేల ఓట్లు జనసేనకు పిఠాపురంలో పడడం ఖాయంగా ఉంది అంటున్నారు. అదే పవన్ నేరుగా దిగివస్తే ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఆయన్ని గెలిపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు.అదే టైమ్ లో కాకినాడ రూరల్ అర్బన్ పెద్దాపురం సహా చాలా నియోజకవర్గాల మీద పవన్ పోటీ చేసిన ప్రభావం పడి అక్కడ కూడా జనసేనకు ఎక్కువ సీట్లు వస్తాయని అంటున్నారు. మరి పవన్ కి స్థానికంగా పోటీ చేయాలని ప్రతిపాదనలు వెళ్తున్నాయి. పవన్ సైతం ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలలో పిఠాపురం ఉంది అంటున్నారు. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.